ట్రైల‌ర్ టాక్‌: స‌్వీటెస్ట్ స్వీటీ థ్రిల్ల‌ర్‌


ట్రైల‌ర్ టాక్‌: స‌్వీటెస్ట్ స్వీటీ థ్రిల్ల‌ర్‌
ట్రైల‌ర్ టాక్‌: స‌్వీటెస్ట్ స్వీటీ థ్రిల్ల‌ర్‌

`అరంధ‌తి` త‌రువాత అనుష్క ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మానింది. రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి ఆ విష‌యాన్ని మ‌రింత స్ప‌ష్టంచేసి వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించాయి. దీంతో అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో మ‌రో సినిమా తెర‌పైకొస్తోంది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్స‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల కాబోతంంది. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోణ ఫిల్మ్ కార్పొరేష‌న్ భాగ‌స్వామ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీ.జి. విశ్వ‌ప్ర‌సాద్, కోన వెంక‌ట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ట్రైల‌ర్‌ని శుక్ర‌వారం నేచురల్ స్టార్ నాని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. ఇదిగో మా స్వీటెస్ట్ స్వీటీ `నిశ్శ‌బ్దం` ట్రైలర్‌. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు` అని ట్విట్ చేశారు. ఈ మూవీ అత్య‌ధిక భాగం అమెరికా నేప‌థ్యంలో సాగుతుంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. హాలీవుడ్ త‌ర‌హాలో మేకింగ్ క‌నిపిస్తోంది. `దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈ రోజు మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది..` అంటూ ఓ అమెరిక‌న్ న్యూస్ రీడ‌ర్ వాయిస్‌తో ఈ ట్రైల‌ర్ మొద‌లైంది. అక్క‌డ చీక‌ట్లో ఎవ‌రో ఎటాక్ చేశారంట‌.. కానీ ఎవ‌రో క‌నిపించ‌లేదంటున్నారు.. అనే డైలాగ్‌లు సినిమా ఏలా వుంబడ‌బోతోందో చిన్ని హిట్ ఇచ్చేస్తున్నాయి.

ఇంత‌కీ అనుష్క‌కీ జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌కీ వున్న‌సంబంధం ఏమిటి?. అంజ‌లి త‌న‌ని ఎందుకు అనుమానిస్తోంది? పాడుడుబ‌డిన విల్లాలోకి అనుష్క‌, మాధ‌వ‌న్ ఎందుకు వెళ్లారు? అక్క‌డ వారు ఏం చూశారు? ఆ త‌రువాత వారి చుట్టు ఎలాంటి సంఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా వుంది. అస‌లు ఘోస్ట్ హౌస్‌లోకి మాధ‌వ‌న్‌, అనుష్క ఎందుకు వ‌చ్చారు? ఇంత‌కీ ఆ ఘోస్ట్ ఎవ‌రు? అన్న‌ది చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నాని చెప్పిన‌ట్టు సీట్ ఎడ్జ్‌ థ్రిల్ల‌ర్ లాగే క‌నిపిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఏప్రిల్ 2న‌ విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.