ఇంగ్లిష్ మీడియం పై  బీజేపీ భిన్న స్వరాలు


AP-BJP-Leaders-Dual-Voice
AP-BJP-Leaders-Dual-Voice

“రాయడానికి ఏమీ లేనప్పుడు, గోడకి ఇంకొకసారి సున్నం రాయండి” అని ఒక ముతక సామెత ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా ఈ సామెత ఎందుకు గుర్తు వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గత కొద్ది రోజులుగా, ఇంగ్లీష్ మీడియం చదువుల చుట్టూ తిరుగుతోంది.  ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నా, ఒక్క కఠోర సత్యం మాత్రం అందరూ గుర్తించాలి. ఇంతకుముందు ప్రభుత్వస్కూల్స్ లో తెలుగు మీడియం ఉన్నా, భవిష్యత్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినా, గవర్నమెంట్ టీచర్లు తీసుకునే జీతానికి తగ్గట్లు, ఒళ్ళు ఒంచి పని చెయ్యనంతవరకు ఈ విద్యా వ్యవస్థ మారదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే విద్య సంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్ళ నందు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కొంత మంది నిపుణులు హర్షం వ్యక్తం చెయ్యగా, మరికొంత మంది మాత్రం తెలుగు బాష కు అన్యాయం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జరిగే ప్రతీ విషయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూసే ప్రస్తుత నాయకులు కనీసం స్పందించే అంశంలో ఒక గూటి కింద ఉన్న వాళ్ళం, ఒక మాట మీద ఉండాలన్న ముందు జాగ్రత్త, ప్రణాళిక, పరస్పర అవగాహన ఏ మాత్రం ఉండటం లేదు. మళ్ళీ వీళ్ళు జాతీయ పార్టీ కి చెందిన పెద్ద మనుషులు, వీళ్ళ సేవలు ఉపయోగించుకుని, సదరు పార్టీ ఇక్కడ నిలబడాలని చూడటం. నిజంగా ప్రజల దౌర్భాగ్యం అనే చెప్పాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమం మీద వ్యతిరేకంగా మాట్లాడారు, AP బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. గతంలో బీజేపీ లోకి రాక ముందు అసలు హిందూ ధర్మం పై అరకోరగా మాట్లాడే ఆయన ఏకంగా ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం వెనుక మాట ప్రచర కుట్ర ఉన్నట్లు మాట్లాడారు.

అయితే మరొక బీజేపీ అగ్ర నాయకుడు సోము వీర్రాజు గారు మాత్రం ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్ కు సానుకూలంగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం లో పిల్లలు చదివితే మంచిది అని, ప్రైవేట్ విద్యా సంస్థల వల్ల ఇప్పటికే 48 శాతం తెలుగు కనుమరుగైపోయింది అని, తెలుగు బాషకు సమాన ప్రాధాన్యత ఉండేలా చూడాలని సూచించారు.

వీళ్ళ ఇద్దరి వాదనలు ఎలా ఉన్నా, ఒకే పార్టీ కి చెందిన ఇద్దరు అగ్ర నాయకులు ఒక అంశం కు సంబంధించి ఇలా తలొక మాట మాట్లాడటం పార్టీ పరిస్తి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఈ వ్యవహారంలో పూల పార్టీ నాయకులను జనాలు అన్ ప్రొఫెషనల్ లీడర్స్ అని తిట్టుకుంటున్నారు.