రోజా కు షాక్ ఇస్తున్న జగన్


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం చేపట్టిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రోజా కు షాక్ ఇవ్వనున్నాడట. నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండో సారి పోటీ చేసి గెలిచిన రోజా కు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాడాని ఆశించింది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రోజా కు మంత్రి పదవి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి కి బదులుగా స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రోజా వాగ్దాటి ఉన్న నేత కావడంతో అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మంచిది , అలాగే రోజా కూడా మంత్రి పదవి ఆశించింది . ఇక జగన్ ప్రభుత్వం ఏర్పడకముందే రోజా కు మంత్రి పదవి ఖాయమని , పైగా హోం మినిస్టర్ గా నియమించడం ఖాయమని వినిపించింది కట్ చేస్తే రోజా కు మంత్రి పదవి కి బదులుగా స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు వినబడుతోంది ఇదే నిజమైతే రోజా కు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.