చంద్రబాబు పై నిప్పులు చెరిగిన జగన్


AP CM Jagan fire on Chandrababu

చంద్రబాబు పై నిప్పులు చెరిగిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు . ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు మాట్లాడిన తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్ అసలు మీకు ప్రతిపక్ష హోదా దక్కిందంటే నేను పెట్టిన బిక్ష . మీ మాదిరిగా నేను చేసి ఉంటే ఇప్పుడు మీ పార్టీలో ఎవరూ ఉండేవాళ్ళు కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు .

మంత్రిపదవులు ఇస్తానని , లేకపోతె ప్రలోభాలకు గురి చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేదని ప్రతిపక్ష హోదా వచ్చేది కాదని , చంద్రబాబు అక్కడ కూర్చొని ఉండేవాడు కాదని , ఎంతమంది మాతో టచ్ లో ఉన్నారో పేర్లు చెప్పాలా ? అంటూ ఆవేశంతో ఊగిపోయాడు . సభలో ప్రతిపక్షం ఉండాలి , మంచి సంప్రదాయాలు రావాలని నేను తాపత్రయపడుతున్నాను కానీ ఇవేమి మీకు పట్టడం లేదు అంటూ చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసాడు జగన్ . మొదటి సభలోనే అధికార ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నారు .