కరోనా తో ఏపీ మాజీ మంత్రి మృతి!


కరోనా తో ఏపీ మాజీ మంత్రి మృతి!
కరోనా తో ఏపీ మాజీ మంత్రి మృతి!

ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా తో మృతి చెందారు. ఈ  విషయాన్ని ఎపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజు అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా మాణిక్యాలరావు ఛాతి నొప్పి , హై బీపీతో బాధపడిన ఆయన విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కరోనా టెస్ట్ చేయగా ఆయనకు పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన గతకొన్ని రోజులుగా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జులై 4 నుంచి విజయవాడ లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన శనివారం ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు. మాణిక్యాలరావు మరణ వార్త తెలిసిన రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.
1989లో బిజెపిలో చేరిన మాణిక్యాలరావు అంచలంచలుగా పార్టీ బలోపేతానికి కృషిచేసి నాయకుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు.