సాయి పల్లవి -రవితేజ పెళ్లి వార్తలు అబద్దమేనట


AP minister denied rumours on Ravi Teja and Sai Pallavi marriage

ఫిదా చిత్రంతో తెలుగు వాళ్ళని ఫిదా చేసిన భామ సాయి పల్లవి ని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు జయదేవ్ చిత్రంతో హీరోగా పరిచయమైన రవితేజ ప్రేమిస్తున్నాడని పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ,అవి మంత్రి చెవిన పడటంతో ఆ వార్తలను ఖండించాడు . మా అబ్బాయి రవితేజ హాయిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటున్నాడు , అలాంటి వాడు హీరోయిన్ సాయి పల్లవి ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి ప్రపోజల్ పెట్టడం ఏంటి ? ఇదంతా వట్టి ట్రాష్ దయచేసి మీడియా వాళ్ళు ఇలాంటి చెత్త ని ప్రచారం చేయొద్దని కోరాడు .

 

ఘంటా రవితేజ జయదేవ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు , అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో రవితేజ ఇంటి పట్టునే ఉంటున్నాడు . ఆల్రెడీ రవితేజ కు పెళ్లి అయ్యింది , పైగా సాయి పల్లవి కి రవితేజ కు పరిచయం కూడా లేదు కానీ ఈ వార్తలు మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యాయి దాంతో మంత్రి ఖండించాల్సి వచ్చింది .