అరాచ‌కానికి ప‌రాకాష్ట `అరాచ‌కం` టీజ‌ర్‌!


అరాచ‌కానికి ప‌రాకాష్ట `అరాచ‌కం` టీజ‌ర్‌!
అరాచ‌కానికి ప‌రాకాష్ట `అరాచ‌కం` టీజ‌ర్‌!

ఈ ప్ర‌పంచంలో కంటికి క‌నిపించ‌ని ప‌‌ర్వ‌ర్టెడ్ పీపుల్స్ చాలా మందే వున్నారు. రామ్‌గోపాల్ వ‌ర్మ లాంటి వాళ్ల‌ని నిత్యం చూస్తూనే వున్నాం. స‌మాజాన్ని ఉద్ద‌రిస్తున్నామ‌ని ఫీల‌వుతూనే త‌మ‌కు తాము బ్రిలియంట్స్‌గా చెప్పుకుంటూ చీక‌ట్లో సైకోల్లా ప్ర‌వ‌ర్తిస్తూ త‌మ భీక‌ర రూపాన్ని ప్ర‌పంచానికి చూపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి ప‌ర్వెర్టెడ్ సైకోల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒంట‌రిగా వున్న మ‌హిళ‌ల‌ని, కంటికి న‌చ్చిన అంద‌మైన వారిపై దారుణంగా అత్యాచారాలు చేస్తూ హ‌త్య చేస్తున్న సైకోలు పెరిగిపోతున్నారు. తాజాగా గే సైకోల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కూల్‌గా .. హ్యండ్స‌మ్‌గా క‌నిపిస్తూనే ఒంట‌రిగా క‌నిపించే మ‌గాళ్ల ప‌ట్ల అత్య‌చారాల‌కు దిగుతున్న గేలు చాలా మందే వున్నారు. అలాంటి ఓ గే క‌థ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం `అరాచ‌కం`.

విభు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శివ దోస‌కాయ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌ర్షా న‌ల్ల‌బెల్లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. క‌థ‌, స్క్నీన్‌ప్లే , ద‌ర్శ‌క‌త్వం సాయి‌రామ్ దాస‌రి. డేవిడ్ బ్రేయినార్డ్ జి సంగీతం అందించ‌గా, ఛాయాగ్ర‌హ‌ణం, అండ్ ఎడిటింగ్ డిఐ – న‌వీన్ నీలిప‌ల్లి అందించారు. సందేశాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ సైకో థ్రిల్ల‌ర్ టీజ‌ర్‌ని మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది.