`ఆచార్య‌` కోసం స్టైలిష్ విల‌న్ ని ఫైన‌ల్ చేశారా?

`ఆచార్య‌` కోసం స్టైలిష్ విల‌న్ ని ఫైన‌ల్ చేశారా?
`ఆచార్య‌` కోసం స్టైలిష్ విల‌న్ ని ఫైన‌ల్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ మూవీ కోసం మ‌రో హీరోని కూడా ఫైన‌ల్ చేశారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. క‌థ‌కు కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ప్ర‌ధాన విల‌న్ పాత్ర‌లో ఒక‌ప్ప‌టి హీరో అర‌వింద‌స్వామిని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.  20016లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ధృవ‌`లో అర‌వింద‌స్వామి విల‌న్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆల‌య భూముల స్కామ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి అర‌వింద‌స్వామి లాంటి విలన్ అయితే బాగుంటుందని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ భావించి ఆయ‌న‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.

త్వ‌ర‌లోనే అర‌వింద‌స్వామి `ఆచార్య‌` సెట్స్‌లో పాల్గొంటార‌ని చిత్ర ఇన్ సైడ్ టాక్‌. త్వ‌ర‌లో మెగాస్టార్ చిరంజీవి సెట్‌లోకి ఎంట‌ర్ కానున్న ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నిరంజ‌న్‌రెడ్డితో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవ‌ల బాయ్‌ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకున్న కాజ‌ల్ కూడా త్వ‌ర‌లోనే `ఆచార్య‌` సెట్‌లో సంద‌డి చేయ‌బోతోంది.