అరవింద సమేత 10 రోజుల కలెక్షన్లు


Aravinda Sametha 10 days ap and ts Collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత భారీ వసూళ్లు సాధిస్తూ దసరా బరిలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే . అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత మొత్తం పది రోజుల్లో 66 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే 66 కోట్లకు పైగా షేర్ రావడంతో బయ్యర్లు దాదాపుగా పెట్టిన పెట్టుబడి తెచ్చుకునారు . ఇక మిగిలింది లాభాలే ! అయితే ఓవర్ సీస్ లో మాత్రం అరవింద సమేత కొనుక్కున్న వాళ్ళకు లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . ఓవర్ సీస్ విషయాన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో వరుసగా అయిదో హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా ఇతర పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , ఈశా రెబ్బా , సునీల్ లు నటించారు .

ఇక 10 రోజుల షేర్ ఏరియాల వారీగా ఎలా ఉందో చూద్దామా !
నైజాం – 19. 60 కోట్లు
సీడెడ్ – 15. 53 కోట్లు
వైజాగ్ – 7. 70 కోట్లు
ఈస్ట్ – 5. 14 కోట్లు
వెస్ట్ – 4. 43 కోట్లు
కృష్ణా – 4. 62 కోట్లు
గుంటూరు – 7. 49 కోట్లు
నెల్లూర్ – 2. 41 కోట్లు

మొత్తం – 66. 72 కోట్లు (షేర్ )

English Title:  Aravinda Sametha 10 days ap and ts Collections