అరవింద సమేత ఫైట్ సీన్ లీక్


Aravinda sametha fight scene leaked

ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఫైటింగ్ సీన్ అది కూడా కీలకమైన సీన్ లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే పలు స్టిల్స్ అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి సంబంధించి లీకులు కాగా తాజాగా జరిగిన లీక్ తో ఆ చిత్ర బృందం నివ్వెరపోయింది . ఎన్టీఆర్ ని , అతడి కుటుంబాన్ని చంపడానికి చేసే ప్రయత్నంలో తండ్రిగా నటిస్తున్న నాగబాబు చనిపోయే సీన్ తాలూకు ఫైట్ సీన్ ఇది . రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఫైట్ లీక్ కావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా నాగబాబు , జగపతిబాబు , ఈషా రెబ్బా, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు . ఇప్పటికే ఎస్ ఎస్ తమన్ అందించిన పాటలపట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలా సీన్లు లీక్ అవుతుంటే అరవింద సమేత వీర రాఘవ చిత్రం కు నష్టం జరగడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి . మరి ఆ అంచనాలను అరవింద సమేత అందుకుంటుందా చూడాలి .

English Title: Aravinda sametha fight scene leaked