అరవింద సమేత లండన్ షెడ్యూల్ క్యాన్సిల్


Aravinda sametha london schedule cancelledయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ” అరవింద సమేత ” వీర రాఘవ . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటోంది కాగా దాని తర్వాత లండన్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లండన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసారట ! రెండు పాటలను లండన్ లో చిత్రీకరించాలని త్రివిక్రమ్ అండ్ కో ప్లాన్ చేసారు కానీ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతోంది కాబట్టి సమయం వృధా చేయడం కంటే ఆ రెండు పాటలను ఇక్కడే చిత్రీకరించాలని భావిస్తున్నారట అందుకే లండన్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది .

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు . ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈశా రెబ్బా నటిస్తుండగా జగపతి బాబు , నాగబాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . దసరా కానుకగా అక్టోబర్ 11న అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: aravinda sametha london schedule cancelled