అరవింద సమేత టాక్ ఎలా ఉందంటే

aravinda sametha premier show talkయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . ఇక అమెరికాలో అప్పుడే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి , అంతేనా ఆంధ్రప్రదేశ్ లో సైతం ప్రీమియర్ షోలు పడ్డాయి . తెల్లవారు ఝామునుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరవింద సమేత కోసం కళ్ళు కాయలు కాచేలా థియేటర్ ల ముందు బారులు తీరారు . ఇక ఆ ప్రీమియర్ షోల ప్రకారం టాక్ ఎలా ఉందో తెలుసా ……. ఓవరాల్ గా అరవింద సమేత హిట్ అని అంటున్నారు . ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది అని అంటున్నారు . అలాగే దర్శకుడిగా త్రివిక్రమ్ కూడా మెప్పించాడని తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అరవింద సమేత కు ఆయువు పట్టుగా నిలిచిందని టాక్ .

ఫస్టాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నప్పటికీ , సెకండాఫ్ లో సెంటిమెంట్ సీన్లతో కట్టిపడేసారని ఓవరాల్ గా దసరా ని పూర్తిగా క్యాష్ చేసుకునే చిత్రమని అంటున్నారు . అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ హిట్ కొట్టాడు అలాగే త్రివిక్రమ్ కూడా అయితే ఇది ఏ స్థాయి హిట్ అన్నది మాత్రం రెండు రోజులు ఆగితే కాని తెలీదు . దసరా సెలవులు ఉన్నందున బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . ఇక ఏ రేంజ్ హిట్ అన్నది రెండు మూడు రోజుల్లోనే తేలిపోనుంది .

English Title: aravinda sametha premier show talk