రికార్డుల మోత మోగిస్తున్న అరవింద సమేత టీజర్


aravinda sametha teaser trending in youtubeనిన్న ఆగస్టు 15 సందర్భాన్ని పురస్కరించుకొని విడుదలైన అరవింద సమేత వీర రాఘవ టీజర్ రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది . ఈరోజు ఉదయం నాటికి అంటే దాదాపు 24 గంటల్లో 60 లక్షల వ్యూస్ సాధించింది అరవింద సమేత టీజర్ . నిన్న ఉదయం యూట్యూబ్ లో విడుదల అవ్వడమే ఆలస్యం వైరల్ గా మారింది . క్షణాల్లో ఎన్టీఆర్ అభిమానులకు చేరడంతో ఆ టీజర్ ని చూడటానికి ఎగబడ్డారు . టీజర్ కూడా మాస్ ప్రేక్షకులు కోరుకునే విధంగా ఉండటంతో భీభత్సమైన వ్యూస్ వచ్చాయి దాంతో 58 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి .

ఎన్టీఆర్ నుండి కోరుకునే యాక్షన్ ఎలాగూ ఉంది అలాగే త్రివిక్రమ్ నుండి కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ కూడా పుష్కలంగా ఉంటుందట చిత్రంలో దాంతో అరవింద సమేత వీర రాఘవ దసరా కు విడుదలై రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై టీజర్ తో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . ఇప్పటికే 60 లక్షల వ్యూస్ ని సాధించిన ఈ టీజర్ ఒకటి రెండు రోజుల్లోనే కోటి ని అవలీలగా దాటేయడం ఖాయమని అంటున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా , సునీల్ , జగపతిబాబు , నాగబాబు తదితరులు నటిస్తున్నారు .

English Title: aravinda sametha teaser trending in youtube