అరవింద సమేత ట్రైలర్ రెడీ


Aravinda sametha trailer ready

అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆ వేడుకలో ట్రైలర్ ని విడుదల చేయనున్నారు అరవింద సమేత చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా , జగపతిబాబు , నాగబాబు , సునీల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు మరోసారి ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించనున్నారట . ఈ వేడుకకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున నందమూరి అభిమానులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు . ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఉత్సుకతతో ఉన్నారు. తమన్ అందించిన సంగీతం పై విమర్శలు వచ్చినప్పటికీ ఓ రెండు పాటలు అయితే ఆకట్టుకుంటున్నాయి . ఇక ఒక పాట అయితే హృదయాలను దహించివేస్తోంది. దసరా కానుకగా విడుదల అవుతున్న అరవింద సమేత తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ముందుగానే దసరా వచ్చేలా ఉంది.

English Title: Aravinda sametha trailer ready