మళ్ళీ ఫోటోలు లీక్ కావడంతో షాక్ అయిన ఎన్టీఆర్


aravinda sametha veera raghava stills leaked againయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ సినిమాలోని స్టిల్స్ మరికొన్ని ఈరోజు లీక్ కావడంతో ఎన్టీఆర్ తో పాటు ఆ చిత్ర బృందం షాక్ అయ్యింది . ఇప్పటికే రెండుమార్లు ఎన్టీఆర్ సినిమాలోని స్టిల్స్ లీక్ కాగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ లీక్ అవుతుండటంతో ఆందోళనలో ఉంది ఆ చిత్ర బృందం . ఎన్టీఆర్ , నాగబాబు లు పాల్గొన్న సన్నివేశానికి సంబందించిన ఫోటోలు లీక్ అయ్యాయి .

ఈనెల 15న టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఆ హడావుడి లో ఉండగా ఎవరో ఈ ఫోటోలను లీక్ చేసి పిచ్చ షాక్ ఇచ్చారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా లు నటిస్తుండగా కీలక పాత్రల్లో నాగబాబు , జగపతిబాబు లు నటిస్తున్నారు . ఇక ఈ సినిమా టీజర్ ని స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న విడుదల చేయనున్నారు . ఇక సినిమాని అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నారు .

English Title: aravinda sametha veera raghava stills leaked again