విడాకులకు కారణం ఏంటో తెలుసా ?


హాట్ భామ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి 19 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టింది . అయితే మలైకా అరోరా నా నుండి విడిపోవడానికి కారణం ఆమె ఇష్టారీతిన వ్యవహరించడమే !అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు అర్భాజ్ ఖాన్ . ఒక కుటుంబంలో ఉన్నామన్న స్పృహ లేకుండానే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటూ భర్త కు చెప్పకుండా ఇష్టారీతిలో ఇంటి నుండి వెళ్లిపోయేదట !

దాంతో ప్రతీ రోజు మలైకా తో అర్భాజ్ ఖాన్ కు గొడవ జరిగేదట ! ఇక అదే సమయంలో అర్జున్ కపూర్ తో మలైకా వ్యవహారం వెలుగు చూడటంతో ఇంత జరుగుతున్నా మలైకా మరింతగా తెగించి తిరుగుతుండటంతో విడాకులు తీసుకోవడమే బెటర్ అని భావించి మలైకా తో విడిపోయాడట అర్భాజ్ ఖాన్ . ఇంకేముంది కావాల్సింది జరగడంతో మలైకా అరోరా అర్జున్ కపూర్ తో హాయిగా ఎంజాయ్ చేస్తోంది .