పెళ్లి కాకుండానే తల్లిదండ్రులు అయ్యారు


Arjun Rampal and Gabriella
Arjun Rampal and Gabriella

పెళ్లి చేసుకోకుండానే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది నటి గాబ్రియెల్లా . కింగ్ నాగార్జున నటించిన ” ఊపిరి ” చిత్రంలో ఓ సాంగ్ లో మెరిసిన భామ ఈ గాబ్రియెల్లా . బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో కొంతకాలంగా సహజీవనం సాగిస్తోంది . ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే అర్జున్ రాంపాల్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు కానీ విడాకులు తీసుకోలేదు దాంతో గాబ్రియెల్లా ని పెళ్లి చేసుకోలేక పోయాడు .

అయితే పెళ్లి సంగతి దేవుడెరుగు కానీ అర్జున్ రాంపాల్ – గాబ్రియెల్లా కలిసి జీవిస్తూ తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది దాంతో గర్భం దాల్చింది . అర్జున్ రాంపాల్ – గాబ్రియెల్లా లకు ఒక కొడుకు జన్మించాడు . తల్లి పిల్లలు బాగున్నారట . దాంతో అర్జున్ రాంపాల్ ఆనందానికి అవధులు లేవు .