ప‌వ‌న్ కోసం బాలీవుడ్ విల‌న్‌!


ప‌వ‌న్ కోసం బాలీవుడ్ విల‌న్‌!
ప‌వ‌న్ కోసం బాలీవుడ్ విల‌న్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ షాకిస్తున్నారు. ఒకేసారి రెండు చిత్రాల్ని ప్రారంభించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్ని కూడా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నారు. ముందుగా సైలెంట్‌గా దిల్‌రాజు, బోనీక‌పూర్‌ల `పింక్‌` రీమేక్‌ని మొద‌లుపెట్టిన ప‌వ‌న్ ఆ వెంట‌నే మ‌రో చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

పిరియాడిక్ ఫిల్మ్‌ని తొలిసారి చేస్తున్నారు. దీనికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత‌ ఏ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలంగాణకు చెందిన రాబిన్‌హుడ్ పండుగ‌ల సాయ‌న్న క‌థ‌గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ ఇండులో బందిపోటుగా  కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా మొత్తం కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం కోసం బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంప‌ల్‌ని ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. మ‌రో హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఖ‌రారు చేసిన‌ట్టు బాలీవుడ్ టాక్‌. ద‌ర్శ‌కుడు క్రిష్‌కు బాలీవుడ్‌లో మంచి నెట్‌వ‌ర్క్ వుంది. దాంతో ప‌వ‌న్‌తో చేస్తున్న సినిమా పాన్ ఇండియా స్థాయి చిత్రం కాబ‌ట్టి బాలీవుడ్ స్టార్స్ వుండాల‌ని వారిని తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. మెయిన్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ న‌టించ‌నుంద‌ట‌.