శ్యామ్ కె. నాయుడుపై చీటింగ్ కేసు!


శ్యామ్ కె. నాయుడుపై చీటింగ్ కేసు!
శ్యామ్ కె. నాయుడుపై చీటింగ్ కేసు!

చోటా కె. నాయుడు సోద‌రుడు శ్యామ్ కె. నాయుడుపై చీటింగ్ కేసు న‌మోదైంది. గ‌తంలో డ్ర‌గ్స్ వివాదంలోనూ శ్యామ్ కె. నాయుడు పేరు వినిపించ‌డం, ఆయ‌న కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం వంటివి అప్ప‌ట్లో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా అత‌నిపై ఓ న‌టి చీటింగ్ కేసు న‌మోదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` సినిమాలోని ఓ హాట్ స‌న్నివేశంలో ఆర్టిస్ట్ శ్రీ‌సుధ న‌టించిన విష‌యం తెలిసిందే. త‌న‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకోవాల‌ని శ్యామ్ కె. నాయుడు త‌న‌ని బ‌ల‌వంతం చేశాడ‌ని, ఆ త‌రువాత త‌న‌ని వ‌దిలించుకోవాల‌ని చూశాడంటూ న‌టి శ్రీ‌ సుధ ఎస్సార్ న‌గ‌ర్‌లోని పోలీస్ స్టేష‌న్‌లో శ్యామ్ కె. నాయుడుపై కంప్లైంట్ చేసింది. దీంతో అత‌న్ని ఎస్సార్ న‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన పోకిరి, బిజినెస్‌మెన్‌, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, జులాయి, టెంప‌ర్ వంటి చిత్రాల‌కు శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఈ సినిమాల కార‌ణంగానే సాయి సుధ‌కు శ్యామ్ కె. నాయుడుకు ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.