`అర్జున్‌రెడ్డి` డైరెక్ట‌ర్‌తో పాన్ ఇండియా స్టార్‌!


`అర్జున్‌రెడ్డి` డైరెక్ట‌ర్‌తో పాన్ ఇండియా స్టార్‌!
`అర్జున్‌రెడ్డి` డైరెక్ట‌ర్‌తో పాన్ ఇండియా స్టార్‌!

తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న చిత్రం `అర్జున్‌రెడ్డి`. తెలుగు సినిమా గ‌మ‌నాన్నే మార్చిన ఈ సినిమా న్యూ ఏజ్ సినిమాల‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రాన్ని త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రీమేక్ చేస్తే అక్క‌డ కూడా భారీ వ‌సూళ్ల‌ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో షాహీద్‌క‌పూర్ హీరోగా `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేస్తే అక్క‌డ 300 కోట్ల‌కు పై చిలుకు వ‌సూళ్ల‌ని సాధించి దేశ వ్యాప్తంగా షాహీద్ క‌పూర్ పేరు మారుమ్రోగేలా చేసింది. ఈ సినిమాతో షాహీద్ క‌పూర్ త‌న మార్కెట్ రేంజ్‌నే మార్చేసుకున్నారు.

ఈ సినిమాతో సందీప్‌ రెడ్డి వంగ ఈ సినిమాతో బాలీవుడ్ బాట ప‌ట్టారు. తొలి చిత్రంతోనే బాలీవుడ్‌లో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ వంగ కు మ‌రో భారీ ఆఫ‌ర్ అభించిందని తెలిసింది. `క‌బీర్‌సింగ్‌`తో పాన్ ఇండియా స్థాయి చిత్రాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న సందీప్ వంగ‌తో `క‌బీర్‌సింగ్‌` మేక‌ర్స్ టీ సిరీస్ అధినేత‌లు మ‌రో భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి మైత్రీ మూవీమేక‌ర్స్ భాగ స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

పాన ఇండియా స్థాయిలో తెర‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. `బాహుబ‌లి`, సాహో చిత్రాల‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అత‌నికి త‌గ్గ క‌థ‌ని సందీప్ వంగ సిద్ధం చేశార‌ని, మేక‌ర్స్ ఇచ్చిన ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో ప్ర‌భాస్ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారాం. బాలీవుడ్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మించ‌నున్న ఈ చిత్రానికి ప్ర‌భాస్ 30 కోట్లు పారితోషికం అందుకోనున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.