అర్జున్ రెడ్డి హిందీ చిత్రం పూర్తి


Arjun reddy hindi remake kabir singh shooting completed

తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” . విజయ్ దేవరకొండ ని అమాంతం పెద్ద హీరోని చేసిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తీసిన విషయం తెలిసిందే . కాగా ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా . షాహిద్ కపూర్ హీరోగా నటించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది ఈ రీమేక్ లో .

 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది , దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగంగా పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే జూన్ 21న విడుదల అని ప్రకటించిన విషయం తెలిసిందే . తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగా . జూన్ 21న రిలీజ్ అయితే కానీ తెలీదు సందీప్ ఆశలకు రెక్కలొచ్చాయా ? లేక ఆవిరయ్యాయా ? అన్నది .

English Title : Arjun reddy hindi remake kabir singh shooting completed