అర్జున్ రెడ్డి మలయాళంలో కూడా


Arjun reddy in malayalam remakeగత ఏడాది తెలుగునాట విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ నట జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది . విజయ్ దేవరకొండ – శాలిని పాండే జంట చూడముచ్చటగా ఉండటంతో పాటు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో యువతని పిచ్చిపిచ్చిగా ఆకర్షించింది అర్జున్ రెడ్డి చిత్రం . దానికి తోడు బోల్డ్ కంటెంట్ కూడా అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడానికి కారణం అయ్యింది . మొత్తానికి తెలుగునాట ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని పలు బాషలలో రీమేక్ చేయడానికి పలువురు పోటీ పడగా ఇప్పటికే హిందీలో రీమేక్ అవుతోంది అలాగే తమిళ్ లో కూడా .

ఇక ఇప్పుడేమో మరో దక్షిణాది బాషా అయిన మలయాళంలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట అర్జున్ రెడ్డి చిత్రాన్ని . హిందీలో షాహిద్ కపూర్ చేస్తుండగా తమిళ్ లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు . ఇక మలయాళంలో విజయ్ దేవరకొండ పాత్రలో నటించేది ఎవరు ? అన్నది ఇంకా తేలలేదు . మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి .

English Title: Arjun reddy in malayalam remake