సందీప్ రెడ్డి వంగా కొడుకు పేరేంటో తెలుసా?


Sandeep reddy Vanga
Sandeep reddy Vanga

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా. కాగా అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి కబీర్ సింగ్ గా ప్రభంజనం సృష్టించాడు . ఈ చిత్రం ఏకంగా 300 కోట్ల భారీ వసూళ్ళని సాధించింది దాంతో సందీప్ రెడ్డి వంగా పేరు మారుమ్రోగుతోంది . ఇక ఆ విషయాన్నీ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగా కొడుకు పేరు ఏంటో తెలుసా ….. అర్జున్ రెడ్డి .

అవును 2014 లో సందీప్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు . కట్ చేస్తే అర్జున్ రెడ్డి చిత్రం విడుదలై మంచి హిట్ అయ్యింది అదే సమయంలో సందీప్ రెడ్డి కి కొడుకు పుట్టాడు దాంతో అర్జున్ రెడ్డి అనే పేరు పెట్టాడు తన కొడుక్కి . అర్జున్ రెడ్డి చిత్రం తనకు బ్లాక్ బస్టర్ ని ఇవ్వడమే కాకుండా జీవితంలో స్థిరపడేలా చేసింది అందుకే తన కొడుక్కి అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాడు సందీప్ రెడ్డి వంగా . అర్జున్ రెడ్డి హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది , దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు ఈ దర్శకుడు . ఇక ఇప్పుడు రాంచరణ్ తేజ్ , మహేష్ బాబు లతో సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా .