తమిళ అర్జున్ రెడ్డి మొత్తానికి పూర్తయ్యింది


Adithya varma
Adithya varma

మొత్తానికి తమిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తయ్యింది . అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ”ఆదిత్య వర్మ ” గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే . స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ చిత్రంతో . అయితే తొలుత ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బాల . కానీ అతడు దర్శకత్వం చేసిన సీన్స్ నిర్మాతలకు నచ్చకపోవడంతో మరొక దర్శకుడిని ఎంపిక చేసుకొని రీ షూట్ చేసారు .

ఇక రెండోసారి గిరీశయ్య దర్శకత్వం వహించాడు . హీరోయిన్ గా బానితా సందు నటించింది . తెలుగులో అలాగే హిందీలో కూడా సంచలన విజయం సాధించడంతో తమిళ్ లో కూడా ప్రభంజనం సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు . ఇక హీరో విక్రమ్ అయితే తన కొడుకు ధృవ్ కు కరెక్ట్ లాంచింగ్ ఆదిత్య వర్మ అని భావిస్తున్నాడు .