కొత్త హంగుల‌తో మ‌ళ్లీ `అర్జున్‌రెడ్డి`..!

Arjun reddy will be re relese in 2022
Arjun reddy will be re relese in 2022

`అర్జున్‌రెడ్డి`.. మూడేళ్ల క్రితం ఆగ‌స్టు 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అండ‌ర్ డాగ్ త‌ర‌హాలో సైలెంట్‌గా రిలీజైన ఈ చిత్రం ప్రివ్యూ షో నుంచే సంచ‌ల‌నాలు సృష్టించ‌డం మొద‌లుపెట్టింది. మూడు గంట‌ల నిడివితో చాలా కాలం త‌రువాత ఓ తెలుగు సినిమా అదీ రెండు చిత్రాల హీరో చేసిన సినిమాగా విడుద‌లై టాలీవుడ్ సినీ చ‌రిత్ర‌ని మ‌రోసారి తిర‌గ‌రాసింది. సినిమాటిక్ స‌న్నివేశాలు లేకుండా క‌ళ్ల‌ముందు ఓ విర‌హ ప్రేమికుడి పెయిన్‌ని వాస్త‌వికంగా చూపించి ఔరా అనిపించింది.

సినిమాటిక్ బ్యారియ‌ర్స్‌ని ప‌క్క‌న పెట్టి టాలీవుడ్‌లో న్యూ గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది. విజ‌య్ దేవ‌ర‌కొండ లోని ఏ స్థాయి న‌టుడున్నాడో యావ‌త్ ప్ర‌పంచానికి చాటిచెప్పి స్టార్ హీరోలే అవాక్క‌య్యేలా చేసింది. ఈ సినిమా త‌రువాత మా భ‌విష్య‌త్తు ఏంటీ అని భ‌య‌ప‌డిన స్టార్ హీరోలు వున్నారంటే `అర్జున్‌రెడ్డి` టాలీవుడ్‌లో ఏ స్థాయి ప్ర‌కంప‌ణ‌లు సృష్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. నిడివి ప‌రంగా మేకింగ్ ప‌రంగా, ఓ న‌టుడికి లైఫ్ టైమ్ నిలిచిపోయే క్యారెక్ట‌రైజేష‌న్ ప‌రంగా బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసిన ఈ చిత్రం మ‌ళ్లీ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

మొత్తం 4 గంట‌ల 20 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని ముందు తెర‌కెక్కించారు. ఆ త‌రువాత నిడివి మ‌రీ ఎక్కువ‌గా వుంద‌ని మిగ‌తా సీన్‌ల‌ని ప‌క్క‌న పెట్టారు. అలా ప‌క్క‌న పెట్టిన స‌న్నివేశాల‌ని తిరిగి యాడ్ చేసి `అర్జున్‌రెడ్డి`ని మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట. 2022 ఆగ‌స్టు 25కు ఈ సినిమా విడుద‌లై ఐదేళ్లు పూర్తి కానున్న సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు సందీప్ వంగా వెల్ల‌డించారు.