నిఖిల్ సినిమా అస్సలు తగ్గట్లేదుగా!


నిఖిల్ సినిమా అస్సలు తగ్గట్లేదుగా!
నిఖిల్ సినిమా అస్సలు తగ్గట్లేదుగా!

యంగ్ హీరో నిఖిల్ కు గత కొంత కాలం నుండి హిట్ అన్నదే లేదు. తన రీసెంట్ సినిమాలు ప్లాప్ అవ్వడమే కాకుండా చేసిన సినిమాను రిలీజ్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాడు. అర్జున్ సురవరం పూర్తైన ఏడాదికి విడుదలైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏదో కొన్ని పర్సనల్ కారణాల వల్ల అర్జున్ సురవరం విడుదల కాకుండా ఆగిపోతూ వచ్చింది. మొత్తానికి ఎలాగైతేనేం ఉన్న సమస్యలు అన్నీ పరిష్కారమై ఈ సినిమా నవంబర్ 29న విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడంతో సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగింది. కేవలం వచ్చి ఏదో మొక్కుబడిగా ప్రసంగించేయడం కాకుండా సినిమాను ఓన్ చేసుకున్నట్లు మాట్లాడాడు. పైగా పవన్ మ్యానరిజం ను అనుకరించి మెగా ఫ్యాన్స్ అందరినీ ఉత్తేజపరిచాడు. ఈ సినిమాకు తనంతట తానే వచ్చానని చెప్పి హైప్ ఇచ్చాడు. ఫలితంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆలస్యమైందన్న సానుభూతి ఒకవైపు, మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ మరోవైపు ఉండడంతో క్రేజ్ బానే వచ్చింది.

అయితే అర్జున్ సురవరం సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినా టాక్ మాత్రం పాజిటివ్ గా లేదు. అలా అని నెగటివ్ టాక్ కూడా రాలేదు. చాలా యావరేజ్ టాక్ వచ్చిందీ సినిమాకు. అసలే లేట్ ప్రోడక్ట్ కావడంతో అర్జున్ సురవరం నిలబడడం కష్టమే అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ అర్జున్ సురవరం అందరి అంచనాలను దాటి పెర్ఫార్మ్ చేస్తోంది. విడుదలైన రోజు ఈ చిత్రం దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే టాక్ యావరేజ్ గా ఉండడంతో రెండో రోజు నుండే కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని ఆశించారు. కానీ అలా ఏం జరగలేదు. పైగా రెండో రోజు నుండి మరింత రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు కూడా హౌస్ ఫుల్స్ బోర్డులే కనిపించాయి. ఇంకా మల్టీప్లెక్స్ వాళ్ళు షోస్ ను కూడా పెంచారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

దీంతో అర్జున్ సురవరం నిలబడినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక సోమవారం నుండి కలెక్షన్స్ ఎక్కువ డ్రాప్ లేకపోతే సినిమా హిట్ అవ్వడం ఖాయం. మొత్తానికి నిఖిల్ ఏడాదికి పైగా ఎదురుచూసినందుకు అర్జున్ సురవరం హిట్ అవుతుండడంతో మనోడు ఫుల్ హ్యాపీస్ గా ఉన్నాడు. ఆశలు వదిలేసుకున్న సినిమా అంచనాలను మించి రాణిస్తుండడంతో నిఖిల్ ఆనందానికి అవధులు లేవు.