అర్జున్ సురవరం రిలీజ్ కాదా ?


arjun suravaram
arjun suravaram

నిఖిల్ హీరోగా నటించిన అర్జున్ సురవరం రిలీజ్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది . చాలాకాలంగా ఈ సినిమా అదిగో రిలీజ్ అంటే ఇదిగో రిలీజ్ అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి . తమిళంలో సంచలన విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు . మొదట్లో ఈ సినిమాకు టైటిల్ సమస్య ఎదురయ్యింది , ఆ టైటిల్ పట్ల పెద్ద గొడవ కూడా అయ్యింది .

దాంతో అర్జున్ సురవరం గా పేరు పెట్టారు . ఇక అప్పటి నుండి అదిగో విడుదల ఇదిగో విడుదల అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . నిఖిల్ కు గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు , చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి దాంతో అర్జున్ సురవరం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఇది ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదు మరి .