మొత్తానికి అర్జున్ సురవరం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందిగా


arjun suravaram release date
Arjun Suravaram release date

యంగ్ హీరో నిఖిల్ సినీ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. వరస ప్లాపులకు తోడు సినిమాను రిలీజ్ కూడా చేసుకోలేని పరిస్థితిలో పడ్డాడు. నిఖిల్ లేటెస్ట్ సినిమా అర్జున్ సురవరం వాయిదాల వాయిదాలు పడుతూ నెలలకు తరబడి విడుదలకు నోచుకోలేదు. ముందు ముద్ర టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం, అదే పేరుతో వేరే సినిమా విడుదలైపోవడంతో టైటిల్ మార్చక తప్పలేదు.

ముద్ర నుండి అర్జున్ సురవరంగా టైటిల్ మారినా కూడా సినిమాకు మోక్షం లభించలేదు. ముందు మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి ఇప్పుడు రిలీజ్ కానుంది. వివిధ కారణాలతో ఇప్పటిదాకా విడుదల కాని ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందట.

దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టి. సంతోష్ తెరకెక్కించాడు. ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న కార్తికేయ 2 ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.