అర్జున్ సురవరం రెండు వారాల కలెక్షన్స్.. సూపర్ హిట్


అర్జున్ సురవరం రెండు వారాల కలెక్షన్స్.. సూపర్ హిట్
అర్జున్ సురవరం రెండు వారాల కలెక్షన్స్.. సూపర్ హిట్

అర్జున్ సురవరం రిలీజ్ కు ముందు నిఖిల్ కు ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో, ఎంత ఇబ్బంది పెట్టిందో కానీ, ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ చూసి నిఖిల్ కు నిజంగానే నిద్రపట్టకపోవచ్చు. ఎందుకంటే అర్జున్ సురవరం ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన సినిమా. ఆఖర్లో అల్లు అరవింద్ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి రిలీజ్ కాగలిగింది. అయినా కూడా వాయిదా పడిన సినిమా కావడంతో ఈ సినిమాపై అద్భుతమైన అంచనాలు అంటూ ఏం లేవు. సినిమా బాగానే వచ్చినా వాయిదా పడిన చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని నిఖిల్ అండ్ కో మథనపడ్డారు. దానికి తోడు అర్జున్ సురవరం చిత్రానికి యావరేజ్ రేటింగులు వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా మిశ్రమ స్పందన లభించింది. దీంతో సినిమా ఫలితంపై సందేహాలు వ్యక్తం చేసారు ట్రేడ్ పండితులు.

అయితే ఆశ్చర్యకరంగా అర్జున్ సురవరం అందరి అంచనాలను దాటుకుంటూ సూపర్ హిట్ స్టేటస్ సంపాదించుకుంది. తొలి వీకెండ్ మాగ్జిమం హౌజ్ ఫుల్స్ తో ఆడిన ఈ చిత్రం, వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా నిలబడింది. రెండో వారానికి, విడుదలైన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో అర్జున్ సురవరానికి కలిసొచ్చింది. పైగా చాలా రోజుల నుండి సరైన సినిమా లేక నీరసించిపోయిన ప్రేక్షకులకు అర్జున్ సురవరం బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. మొదటి వారానికె ఈ చిత్రం చాలా చోట్ల సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.

అర్జున్ సురవరం తెలుగు రాష్ట్రాల టూ వీక్స్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం: 3.60 కోట్లు

సీడెడ్: 0.91 లక్షలు

ఉత్తరాంధ్ర: 1.00 కోట్లు

కృష్ణ: 0.64 లక్షలు

గుంటూరు: 0.68 లక్షలు

ఈస్ట్: 0.58 లక్షలు

వెస్ట్: 0.50 లక్షలు

టోటల్: 7 కోట్లు

ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ దాదాపు 6 కోట్లకు జరిగింది. ఇది వరల్డ్ వైడ్ గా లెక్కేసుకుంటే జరిగిన డీల్. రెండు వారాలకు అర్జున్ సురవరం తెలుగు రాష్ట్రాల నుండే 7 కోట్లు వసూలు చేయడంతో ఆరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇలా అందరూ ఈ సినిమాతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

నిఖిల్ ఏడాది పాటు పడిన టెన్షన్ కు దాన్ని మైమరపించే రిజల్ట్ రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.