హీరో విశాల్ పై అరెస్ట్ వారెంట్


హీరో విశాల్ పై అరెస్ట్ వారెంట్
హీరో విశాల్ పై అరెస్ట్ వారెంట్

హీరో విశాల్ గతకొంత కాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు . తాజాగా చెన్నై ఎగ్మూర్ కోర్టు విశాల్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . విశాల్ తన కార్యవర్గం యొక్క టీడీఎస్ ని సరైన పద్దతిలో కట్టలేదని ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది . అయితే ఎన్నిసార్లు నోటీసులు అందించినా విశాల్ వాటిని లెక్కచేయకుండా సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆదాయపు పన్ను శాఖాధికారులు ఎగ్మూర్ కోర్టుని ఆశ్రయించారు .

దాంతో ఆగ్రహించిన కోర్టు విశాల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది .విశాల్ స్వయంగా ఆదాయపు పన్ను శాఖాధికారుల ముందు హాజరు కావాల్సిందేనని ఒకవేళ అలా హాజరు కాకపోతే  ఈనెల 28 న అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశింది . ఈనెల 28 అంటే చాలా సమయం ఉన్నందున ఈలోపు విశాల్ ఆదాయపు పన్ను శాఖ ముందు హాజరు అవుతాడేమో చూడాలి .