విడిపోతున్న మరో జంట


ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం లేదా సహజీవనం చేయడం ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయిన ఈరోజుల్లో మరో జంట విడాకులకు సిద్ధమైంది . అరుణోదయ్ సింగ్ అనే బాలీవుడ్ నటుడు తన భార్య లీ ఎల్టన్ తో విడాకులకు సిద్దమయ్యాడు. ఈ విడాకుల నిర్ణయం తీవ్రంగా కలిచివేస్తోంది కానీ తప్పదు అంటూ ఓ పోస్ట్ పెట్టాడు అరుణోదయ్ సింగ్ తన ఇన్ స్టా గ్రామ్ లో . 
 
కెనెడా కు చెందిన లీ ఎల్టన్ కు గోవాలో ఓ రెస్టారెంట్ ఉంది , దాంతో తరచుగా గోవా కెళ్లే అరుణోదయ్ సింగ్ తో లీ కి పరిచయం ఏర్పడింది , ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016 లో పెళ్లి చేసుకున్నారు అంగరంగ వైభవంగా . అయితే పెళ్లి చేసుకున్నాక రెండున్నర సంవత్సరాల్లోనే కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నారు . కలిసి ఉండి గొడవ పడే కంటే విడిపోయి ఎవరి జీవితాలను వాళ్లు కొనసాగిస్తే మంచిదని అంటున్నాడు . అంటే రెండున్నర సంవత్సరాల్లో ప్రేమంతా పోయిందన్న మాట .