`శాకుంత‌లం` కోసం `అరువి` ఫేమ్‌!

`శాకుంత‌లం` కోసం `అరువి` ఫేమ్‌!
`శాకుంత‌లం` కోసం `అరువి` ఫేమ్‌!

భారీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న గుణ‌శేఖ‌ర్ ప్రస్తుతం `శాకుంతలం` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ముద్దుల త‌న‌య నీలిమా గుణ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ పీరియడ్ ఎపిక్ లవ్ సాగాలో సమంత అక్కినేని టైటిల్ ‌పాత్ర‌లో నటిగా నటిస్తోంది. కొన్ని వారాల క్రితం హైదరాబాద్‌లో ఈ మూవీ షూట్ లాంఛ‌నంగా ప్రారంభమైంది.

మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మీన‌న్ ఈ చిత్రంలో స‌మంత‌కు జోడీగా న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించి మ‌రో కీల‌క పాత్ర కోసం త‌మిళ న‌టిని గుణ‌శేఖ‌ర్ ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. త‌మిళంలో 2017లో విడుద‌లై అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన చిత్రం `అరువి`. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీ ద్వారా ప‌రిచ‌య‌మై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న న‌టి  అదితి బాలన్.

అలాంటి సంచ‌ల‌న న‌టిని `శాకుంత‌లం`లోకి ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక చేసుకున్నార‌ట‌. ఇదే ఆమె న‌టిస్తున్న తొలి తెలుగు చిత్రం. ఇటీవ‌లే సెట్స్‌లోకి అదితి బాలన్ ప్ర‌వేశించింద‌ని తెలిసింది. ఈ నటి వారం క్రితం ఈ చిత్ర షూటింగ్‌‌లో చేరింది. ఈ విష‌యాన్నిఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం సమంత 150 డేస్ కేటాయించినట్లు సమాచారం.