సుకుమార్ … ఐదుగురికి ఛాలెంజ్ విసిరారు!


సుకుమార్ ... ఐదుగురికి ఛాలెంజ్ విసిరారు!
సుకుమార్ … ఐదుగురికి ఛాలెంజ్ విసిరారు!

సందీప్ వంగ స్టార్ట్ చేసిన `బీ ద రియ‌ల్ మెన్ ` ఛాలెంజ్ ర‌స ప‌ట్టుగా సాగుతోంది. రాజ‌మౌళి దీనికి   రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కీర‌వాణి, `బాహుబ‌లి` ప్రొడ్యూస‌ర్‌ శోభు యార్ల‌గ‌డ్డ, సుకుమార్‌ల‌ను నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ముందుగా ఎన్టీఆర్ టాస్క్‌ని పూర్తి చేసి ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, కొర‌టాల శివ‌ల‌ని నామినేట్ చేశారు.

రామ్‌చ‌ర‌ణ్ టాస్క్‌ని పూర్తి చేసి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, బాలీవుడ్ రాక్‌స్టార్ ర‌ణ్‌వీర్‌సింగ్, రానా ద‌గ్గుబాటి, శ‌ర్వానంద్‌ల‌కు ఛాలెంజ్ విసిరారు. అయితే ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తున్న‌ట్టు `ఛాలెంజ్‌` సినిమా క్లిప్‌ని వాడుకున్న చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ వీడియో కోసం ఎదురుచూస్తున్నాన‌ని రిప్లై ఇచ్చారు. తాజా జ‌క్క‌న్న విసిరిన ఛాలెంజ్‌ని స్వీక‌రించిన `ఆర్య‌` సుక్కు సుకుమార్ బుధ‌వారం ఉద‌యం త‌న వీడియోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశారు.‌

ఇల్లు ఊడ్చి…ఫ్లోర్ క్లీన్ చేసి.. పాత్ర‌లు క‌డిగిన సుకుమార్ త‌న ఛాలెంజ్‌ని పూర్తి చేశారు. వీడియోని షేర్ చేసిన సుకుమార్ ఈ ఛాలెంజ్‌కు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని, వంశీ పైడిప‌ల్లి, సురేంద‌ర్‌రెడ్డి, కొర‌టాల శివ‌, తో పాటు ఈ ఛాలెంజ్‌లోకి నిర్మాత దిల్‌రాజుని కూడా తీసుకొచ్చారు. దీంతో ఇది నిర్మాత‌ల వైపు ట‌ర్న్ అవుతుందో చూడాలి.

Credit: Instagram