సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌కి అశోక్ గ‌ల్లా ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్‌!


సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌కి అశోక్ గ‌ల్లా ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్‌!
సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌కి అశోక్ గ‌ల్లా ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్‌!

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఆదివారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌నయుడు అశోక్ గ‌ల్లా సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌కి పుట్టిన రోజున ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. అశోక్ గ‌ల్లా హీరోగా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. అమరరాజా
మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ప గ‌ల్లా ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఈ చిత్ర టీమ్ ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. `య‌మ‌లీల‌` చిత్రం కోసం సూప‌ర్‌స్టార్ కృష్ణ పై చిత్రీక‌రించిన `జుంబారే జుజుంబ‌రే..` పాట‌ని రీమిక్స్ చేసి రిలీజ్ చేశారు. అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ క‌లిసి ఈ పాట‌లో న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ఈ పాట‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ని మ‌న‌వ‌డు అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్‌.. పాట‌కు త‌గ్గ‌ట్టుగా కుదిరాయి. ఈ పాట‌లో మ‌రింత గ్లామ‌ర‌స్‌గా నిధి అగ‌ర్వాల్ కూడా మెర‌వ‌డంతో పాటకి మ‌రింత గ్లామ‌ర్ యాడ‌య్యింది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం పూర్త‌యింది. జిబ్రాన్ సంగీతం, రిచ‌ర్డ్ ప్ర‌సాద్ ఛాయాగ్ర‌హణం అందిస్తున్నారు.