అవన్నీ గాలి వార్తలేనట


ashwini dutt denied rumours on chiru project

మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటివరకు నాలుగు చిత్రాలు చేశాను , భవిష్యత్ లో మళ్ళీ చాన్స్ వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను అయితే చిరంజీవి 152 వ చిత్రాన్ని మాత్రం నేను నిర్మించడం లేదని , చిరు 152 వ సినిమాకు నేనే నిర్మాత అని వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలే అని కొట్టిపడేసాడు అగ్ర నిర్మాత అశ్వనిదత్ . మెగాస్టార్ చిరంజీవిఅశ్వనీదత్ ల కాంబినేషన్ లో జగదేకవీరుడు – అతిలోకసుందరి , చూడాలని ఉంది , జై చిరంజీవ ,ఇంద్ర చిత్రాలు రాగా జగదేకవీరుడు – అతిలోక సుందరి , ఇంద్ర చిత్రాలు తెలుగుచలన చిత్ర చరిత్రని తిరగరాసాయి .

అయితే మద్యలో అశ్వనీదత్ నిర్మించిన పలు చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయాడు దాంతో కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాడు . కట్ చేస్తే మహానటి తో మళ్ళీ వైజయంతి మూవీస్ ప్రభంజనం మొదలయ్యింది . మహానటి సంచలన విజయం సాధించింది . దేవదాస్ నిర్మాతకు లాభాలను తెచ్చింది కానీ బయ్యర్లని ముంచింది . ఇక ఇప్పుడేమో మహేష్ బాబుతో మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అశ్వనీదత్ కాకపోతే భాగస్వామ్యంలో చేస్తున్నాడు . చిరంజీవితో కూడా మళ్ళీ సినిమా చేయాలనీ భావిస్తున్నాడు వర్కౌట్ అవుతుందో ? లేదో చూడాలి .

English Title: ashwini dutt denied rumours on chiru project