విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే అడ‌గమంటోంది!

Ask this question to vijay devarakonda - rashmika
Ask this question to vijay devarakonda – rashmika

`ఛ‌లో` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న ఆ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన `గీత గోవిందం`తో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ అనూహ్య విజ‌యాన్ని సాధించి వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్ణిని ఆక‌ర్షించింది ర‌ష్మిక‌. తెలుగు, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్న ర‌ష్మిక్ స‌ర‌దాగా అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ముచ్చ‌టించింది.

ఈ సంద‌ర్భంగా అభిమానులు, నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్‌గా స‌మాధానం చెప్పింది. అయితే న‌చ్చిన హీరో ఎవ‌రంటే మాత్రం నో కామెంట్ అనేసింది. ఇక దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉదృతంగా వుంద‌ని, బ‌య‌ట ప‌రిస్థితులు ఏం బాగాలేవ‌ని త‌ప్ప‌కుండా ఇంళ్ల‌లోనే వుండండ‌ని, జ‌నస‌మూహాల‌కు దూరంగా వుండండ‌ని తెలిపింది. బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే ఖ‌చ్చితంగా మాస్క్ ధ‌రించండ‌ని సూచించింది.

ఇదే సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో మ‌రో సినిమా చేస్తారా? అని అడిగితే ఈ ప్ర‌శ్న మీరు విజ‌య్‌ని అడ‌గండని, ఒక‌వేళ ఎవ‌రైనా ద‌ర్శ‌కులు మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా క‌లిసి న‌టిస్తా` అని స‌మాధానం చెప్పింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులో `పుష్ప‌` చిత్రంతో పాటు హిందీలో రెండు భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. గ‌త కొన్ని రోజుల క్రితం హిందీ చిత్రాల షూటింగ్‌ల కోసం ముంబైలో స్టే చేసిన ర‌ష్మిక ప్ర‌స్తుతం `పుష్ప‌` చిత్రీక‌ర‌ణలో పాల్గొంటూ హైద‌రాబాద్‌లో వుంటోంది.