అసుర‌న్ రీమేక్ మొద‌ల‌య్యేది అక్క‌డేనా?


అసుర‌న్ రీమేక్ మొద‌ల‌య్యేది అక్క‌డేనా?
అసుర‌న్ రీమేక్ మొద‌ల‌య్యేది అక్క‌డేనా?

త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించ‌న చిత్రం `అసుర‌న్‌`. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం కులాల ఆధిప‌త్యం, హ‌త్య‌ల నేప‌థ్యంలో రూపొందింది. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిపిందే. తెలుగు రీమేక్ హ‌క్కుల్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్‌బాబు సొంతం చేసుకున్నారు. `వెంకీమామ‌` విజ‌యంతో సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకున్న విక్ట‌రీ వెంక‌టేష్ రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ధ‌నుష్ వ‌య‌సు మ‌ల్లిన వ్య‌క్తిగా. యువ‌కుడిగా రెండు భిన్న పార్శ్వాల్లోసాగే పాత్ర‌లో న‌టించారు. తెలుగులోనూ అదే త‌ర‌హాలో వెంక‌టేష్ పాత్ర కూడా వుండ‌బోతోంది. అయితే తెలుగు నేటీవిటీకి అనుగునంగా క‌థ‌లో కొన్ని మార్పులు చేశార‌ట‌. గ్రామీణ‌ నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ చిత్రాన్ని రాయ‌ల‌సీమ అనంత‌పురం నేప‌థ్యంలో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

రెండు వ‌ర్గాల మ‌ధ్య సాగే ప‌గా ప్ర‌తీకారాల నేప‌థ్యంలో ఈ చిత్రం వుంటుంద‌ని తెలుస్తోంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియ‌మ‌ణిని ఫైన‌ల్ చేశారు. కేవ‌లం రెండు నెల‌ల్లో చిత్రాన్ని పూర్తిచేసి స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని డి. సురేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారు.