తమిళంలో పెద్ద హిట్టు.మరి తెలుగులో రిలీజ్ చేస్తారా?


Asuran
Asuran

ఈ రోజు తెలుగు సినిమాలు విడుదల లేకపోయినప్పటికీ ‘రజినీకాంత్’ అల్లుడిగా ఆరంగేట్రం చేసిన ‘ధనుష్‘ సినిమా ‘అసురన్’ ఈ రోజు విడుదల అయ్యింది. ఈ సినిమా పై తమిళనాడు ధనుష్ అభిమానులకి భారీగా అంచానాలు ఉన్నాయి. ఆ అంచనాలని దాటుకొని సినిమా భారీ విజయాన్ని మొదటి రోజే సంపాదించుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి అని చెప్పి విడుదల చేయలేదు.

మరి ఇప్పుడు ఈ సినిమా తమిళనాడు థియేటర్ లో రచ్చ చేస్తుంది. ఒక మంచి రోజు చూసుకొని సినిమా  తెలుగులో రిలీజ్ చేస్తారేమో మరి చూడాలి అంటున్నారు తెలుగు ధనుష్ అభిమానులు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వెట్రిమారన్-ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ సినిమా ఇది. అందుకే వీరి కాంబినేషన్ కి అభిమానులు ఎదురుచూస్తున్న పెద్ద హిట్టు బొమ్మ పడింది.ఈ సినిమాలో ధనుష్ రెండు క్యారెక్టర్లో నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు.

2014 సంవత్సరంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్ ఈ సినిమాలో కథానాయికగా చేసింది.  ఇంకా ఈ సినిమాలో మన ప్రకాష్ రాజ్ గారు నటించారు… ఇంకా పశుపతి, అమ్ము అభిరామి ఇతర పాత్రల్లో నటించారు. సంగీతాన్ని అందించింది జి.వి.ప్రకాష్ కుమార్. విచిత్రంగా ఈ రోజే జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మన తెలుగు సినిమా (100% లవ్) కి తమిళ రీమేక్ గా 100% కాదల్ సినిమా తమిళంలో  విడుదల అయ్యింది.

అసురన్ సినిమాని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ అయిన వి క్రియేషన్స్ అధినేత  ‘కలైపులి ఎస్ తాను’ 55 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. మొత్తానికి మా’రి-02′ సినిమా అపజయం తర్వాత తీసిన సినిమా ధనుష్ కి మొదటి రోజే అసురన్ రూపంలో మంచి హిట్ దక్కింది అని చెప్పవచ్చు. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే…..