ఆ సినిమా త‌రువాతే రిటైర్‌మెంట్!


ఆ సినిమా త‌రువాతే రిటైర్‌మెంట్!
ఆ సినిమా త‌రువాతే రిటైర్‌మెంట్!

వెండితెర అద్భుతం `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి`.మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుంద‌రి‌ని శ్రీ‌దేవి న‌టించిన ఈ సోషి‌యో ఫాంట‌సీ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు.  వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.అశ్వ‌నీద‌త్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ మూవీ 1990 మే 9న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా తెర‌పైకి రావ‌డానికి పెద్ద యూగ‌మే జ‌రిగింది.

`జ‌గ‌దేక‌వీరునిక‌థ‌` త‌ర‌హాలో ఫాంట‌సీ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయాల‌న్న అశ్వ‌నీద‌త్‌ కోరిక ర‌చ‌యిత శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ఇచ్చిన చిన్న ఐడియాతో కార్య‌రూపం దాల్చింది. ఈ సినిమా విడుద‌లై ఈ నెల 9కి 30 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని నిర్మాత అశ్వ‌నీద‌త్ వెల్ల‌డించారు.

`జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి` చిత్రానికి సీక్వెల్ వుంటుంద‌ని, అదే నిర్మాత‌గా త‌న చివ‌రి ఇచిత్ర‌మ‌వుతుంద‌ని, ఆ త‌రువాతే తాను రిటైర్‌మెంట్ తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. ఇది ఎప్పుడు వుంటుంది? ఎవ‌రు న‌టిస్తార‌న్న విష‌యాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను` అని వెల్ల‌డించారు. అయితే ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్ న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. తొలి భాగంలో చిరు, శ్రీ‌దేవి న‌టిస్తే సీక్వెల్‌లో వారి వార‌సులు న‌టిస్తార‌న్న‌ది చాలా రోజులుగా వినిపిస్తోంది.