అశ్వద్ధామ మూవీ ప్రివ్యూ

అశ్వద్ధామ మూవీ ప్రివ్యూ
అశ్వద్ధామ మూవీ ప్రివ్యూ

మూవీ ప్రివ్యూ: అశ్వద్ధామ
నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ తదితరులు
దర్శకత్వం: రమణ తేజ
నిర్మాత: ఉష మూల్పూరి
సంగీతం: శ్రీ చరణ్ పాకల
విడుదల తేదీ: జనవరి 31, 2020

నాగ శౌర్య ఎప్పుడూ లేనంత కాన్ఫిడెంట్ గా తన లేటెస్ట్ సినిమా అశ్వద్ధామ విషయంలో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం ఈ హీరోకి చాలా అవసరం. వరసగా మూడు ప్లాపుల తర్వాత నాగ శౌర్య ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అశ్వద్ధామ హిట్ అవ్వకపోతే హీరోగా కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం, అంతే కాకుండా ఈ సినిమాను శౌర్య ఎంతో నమ్మి తెరకెక్కించాడు. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. స్వయంగా తానే కథ రాసుకుని, నిర్మాతగా మారి తెరకెక్కించాడు. దర్శకత్వ బాధ్యతలు కూడా తన స్నేహితుడికే అప్పగించాడు. ఈ నేపథ్యంలో అశ్వద్ధామ హిట్ అవ్వకపోతే తన నమ్మకం వమ్మైనట్లే.

తన స్నేహితుడి చెల్లలి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నాడు శౌర్య. తన మార్కెట్ కంటే ఎక్కువగానే ఈ సినిమాపై ఖర్చు పెట్టాడు. తొలిసారి పూర్తి స్థాయి మాస్ సినిమాను అటెంప్ట్ చేసాడు. ఇన్ని రకాలుగా నాగ శౌర్యకు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం.

ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కానీ రిలీజ్ ముందర కానీ ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. నాగ శౌర్య కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు లేదా అశ్వద్ధామ టీజర్, ట్రైలర్ ద్వారా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల కావచ్చు అశ్వద్ధామకు ప్రస్తుతం అంతా పాజిటివ్ గానే ఉంది. ఇదే పాజిటివ్ ఇంపాక్ట్ రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ అయితే నాగ శౌర్య కలలు కంటున్న హిట్ సొంతమైనట్లే.