అశ్వద్ధామ – నాగ శౌర్య టార్గెట్ ఇదే!



అశ్వద్ధామ - నాగ శౌర్య టార్గెట్ ఇదే!
అశ్వద్ధామ – నాగ శౌర్య టార్గెట్ ఇదే!

నాగ శౌర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అశ్వద్ధామ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ తో ఈ చిత్రం మంచి అంచనాలనే నెలకొల్పింది. పైగా నాగ శౌర్య ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రానికి తానే కథ అందించడం, తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కడం జరిగాయి. తన స్నేహితుడు రమణ తేజ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మెహ్రీన్ కథానాయిక.

నాగ శౌర్య కెరీర్ పరంగా ఇప్పుడు లో ఫేజ్ లో ఉన్నాడు. తన ఆఖరి మూడు సినిమాలు దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. అయినా కానీ అశ్వద్ధామకు బిజినెస్ పరంగా లోటు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7.60 కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఇంకా నాన్ థియేట్రికల్ హక్కులు కూడా కలుపుకుంటే ఆ రేటు 14 కోట్లను దాటవచ్చు.

అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్:

నైజాం – Rs 1.80 కోట్లు

సీడెడ్ – Rs 0.70 కోట్లు

ఆంధ్ర – Rs 2.50 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ – Rs 5.00 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – Rs 0.40 కోట్లు

ఓవర్సీస్ – Rs 1.20 కోట్లు

ప్రింట్ + పబ్లిసిటీ – Rs 1.00 కోట్లు

వరల్డ్ వైడ్ – Rs 7.60 కోట్లు

సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని యూ/ఏ తో క్లియర్ చేసారు. 133.40 నిమిషాల క్రిస్పీ రన్ టైం తో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమాతో నాగ శౌర్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.