ఆ ఇద్ద‌రికి ఇచ్చింది అంతేనట‌!


ఆ ఇద్ద‌రికి ఇచ్చింది అంతేనట‌!
ఆ ఇద్ద‌రికి ఇచ్చింది అంతేనట‌!

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుంద‌ర శ్రీ‌దేవి క‌లిసి న‌టించిన చిత్రం `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి`. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై ఈ నెల 9కి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ తెర‌పైకి రావ‌డానికి నిర్మాత అశ్వ‌నీద‌త్ పెద్ద య‌జ్ఞ‌మే చేశార‌ట‌. చిన్న ఆలోచ‌న‌తో మొద‌లై ర‌చ‌యిత శ్రీ‌నివాస‌చ‌క్ర‌వ‌ర్తి చెప్పిన లైన్‌తో కార్య‌రూపం దాల్చిన ఈ చిత్రం చిరు, శ్రీ‌దేవి కెరీర్‌లోనే మ‌ర‌పురాని చిత్రంగా నిలిచిపోయింది.

ఈ సినిమా తెర‌పైకి రావ‌డానికి తెర వెనుక ఎన్నో జ‌రిగాయ‌ట‌. వాటిల్లో కొన్ని సీక్రెట్‌ల‌ని ఇటీవ‌ల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ బ‌య‌ట‌పెట్టారు. 7 కోట్లు షేర్‌ని రాబ‌ట్టిన ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవికి, అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవికి ఇచ్చిన పారితోషికం ల‌క్ష‌ల్లోనే అని అశ్వ‌నీద‌త్ వెల్ల‌డించారు. ప్ప‌ట్లో చిరు కి భారీ క్రేజ్ వుంది ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న‌కు 35 ల‌క్ష‌లు పారితోషికం ఇస్తే శ్రీ‌దేవికి 25 ల‌క్ష‌లు ఇచ్చార‌ట‌.

శ్రీ‌దేవికి అప్ప‌ట్లో టాప్ హీరోల స్థాయిలో క్రేజ్ వుండేది. ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే ఆమెకు 25 ల‌క్ష‌లు అంద‌జేశార‌ట‌. ఇక ఈ సినిమాకు అయిన ఖ‌ర్చుల‌న్నీ పోను నిర్మాత‌కు 35 ల‌క్ష‌లు మిగిలింద‌ని ఈ సంద‌ర్భంగా అశ్వ‌నీద‌త్ వెల్ల‌డించారు. అశ్వ‌నీద‌త్ త్వ‌ర‌లో ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్‌ల క‌ల‌యిక‌లో సోషియో ఫాంట‌సీ చిత్రాన్ని నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే.