జబర్దస్త్ ఫేమ్ నరేష్ పై దాడి


Attack on jabardasth naresh

జబర్దస్త్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన నరేష్ (పొట్టి నరేష్) పై శ్రీకాకుళం లో దాడి జరిగింది. నరేష్ బృందం శ్రీకాకుళంలో డ్యాన్స్ ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్ళింది అయితే మేకప్ రూంలో అందరూ రెడీ అవుతుండగా లోపలకు వెళ్లి తొంగి చూడటానికి ప్రయత్నించారు కొంతమంది యువకులు. అయితే లోపల మహిళలు బట్టలు మార్చుకునే గది కాబట్టి లోపలకు రావద్దని గట్టిగా వారించారు బౌన్సర్ లు.

 

అయితే బౌన్సర్ లు యువకుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో గొడవ జరిగింది. దాంతో అక్కడి నుండి నరేష్ బృందం కారులో వెళ్తుండగా కారుపై దాడి చేశారు. యువకుల దాడితో భయాందోళనకు గురైన నరేశ్  బృందం పోలీసులను ఆశ్రయించడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. మొత్తం 25 మంది యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు పోలీసులు.

 

English Title: Attack on jabardasth naresh