అత్తారింటికి దారేది తమిళ్ లో రీమేక్ అవుతోంది


Attarintiki Daredi Tamil remake rights sold out2013 లో విడుదలై తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం ” అత్తారింటికి దారేది ”. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్ల తర్వాత తమిళ్ లో రీమేక్ చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ . అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే లైకా సంస్థ అత్తారింటికి దారేది తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ త్రివిక్రమ్ కు కృతఙ్ఞతలు తెలియజేసింది లైకా సంస్థ .

ప్రస్తుతం ఈ సంస్థ సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో సీక్వెల్ ” 2 . 0 ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు . దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పై దృష్టి పెట్టింది , ఆ సినిమా విడుదల అయిన తర్వాత అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ పై దృష్టి పెట్టనున్నారు . పవన్ కళ్యాణ్, సమంత , నదియా , బొమన్ ఇరానీ , రావు రమేష్ , ప్రణీత , బ్రహ్మానందం , శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన అత్తారింటికి దారేది చిత్రం 2013 లో ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలై సంచలన విజయాన్ని సాధించింది . రిలీజ్ కి ముందే సగం సినిమా నెట్ లో దర్శనం ఇవ్వడంతో షాకైన చిత్ర బృందం హుటాహుటిన సినిమాని విడుదల చేసారు అయితే సగం సినిమా నెట్ లో లీక్ అయినప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టించాడు పవన్ కళ్యాణ్ . ఇక ఈ రీమేక్ లో నటీనటులు ఎవరు అన్నది త్వరలోనే తేలనుంది .

English Title: attarintiki daredi tamil remake rights sold out