ఇది రంగమ్మత్త రంగస్థలం


audience praised anasuya

హాట్ భామ అనసూయ రంగస్థలం చిత్రంలో నటిస్తోంది అనగానే అందాలు ఆరబోసే క్యారెక్టర్ చేసి ఉంటుందని అనుకున్నారు అంతా దానికి తోడూ అనసూయ క్యారెక్టర్ ని మొన్నటి వరకు కూడా రివీల్ చేయకపోవడంతో అలాగే అనుకున్నారు కట్ చేస్తే ….. సినిమా విడుదల అయ్యింది అనసూయ క్యారెక్టర్ చూస్తే అప్పుడు కానీ అర్ధం కాలేదు ఎంత గొప్ప క్యారెక్టర్ చేసిందో . రంగస్థలం చిత్రంలో చరణ్ , ఆది , సమంత , జగపతిబాబు పాత్రలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అనసూయ క్యారెక్టర్ కు కూడా అంతటి ప్రాధాన్యత ఉంది .

రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా నటించింది . అనసూయ క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇంతటి మంచి పాత్ర సుకుమార్ ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది అనసూయ . బుల్లితెర పై అందాలను ఆరబోసే ఈ భామ వెండితెర పై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది . మొత్తానికి ఇది రంగమ్మత్త రంగస్థలం అనిపించేలా చేసింది అనసూయ తన నటనతో .