రాక్షసుడు గట్టెక్కాలంటే 17 కోట్లు సాధించాలి !


rakshasudu collections
rakshasudu collections

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గట్టెక్కాలంటే 17 కోట్ల షేర్ వసూల్ చేయాలి . ఆగస్టు 2 న విడుదలైన ఈ చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది అయితే ఆగస్టు 1 నుండే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి దాంతో మొదటి రోజున రెండు కోట్లకు పైగా మాత్రమే షేర్ వచ్చింది . ఆగస్టు 1 నుండి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి దాంతో సినిమాకు ప్రేక్షకులు తక్కువగా వెళ్తున్నారు .

ఇదే పరిస్థితి ముందు ముందు కూడా ఎదురైతే రాక్షసుడు 17 కోట్ల షేర్ సాధించడం కష్టమే అవుతుంది. పైగా వచ్చేవారం నాగార్జున నటించిన మన్మథుడు 2 కూడా విడుదల అవుతోంది . దాంతో ఇప్పుడే వసూళ్ళని రాబట్టాలి . అయితే ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్ లు పెంచారు కాబట్టి వాటి వల్ల రాక్షసుడు చిత్రం గట్టెక్కుతుందో చూడాలి .