మూడో హిట్ కోసం మళ్ళీ


avasarala srinivas  and nagashourya works together again ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడమే కాకుండా హిట్ కూడా అందుకున్నాడు నటుడు అవసరాల శ్రీనివాస్ . ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ” జ్యో అచ్యుతానంద ” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు అవసరాల అది కూడా హిట్టు దాంతో అవసరాల శ్రీనివాస్ పై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి . పలువురు హీరోలు అవసరాల డైరెక్షన్ లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు . అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ” ఊహలు గుసగుసలాడే ” , జ్యో అచ్యుతానంద ” చిత్రాల్లో యంగ్ హీరో నాగశౌర్య నటించాడు .

కట్ చేస్తే మళ్ళీ మూడో హిట్ కోసం మళ్ళీ ఓ సినిమాకు రెడీ అవుతున్నారట ! అయితే ఈసారి ఇక్కడ కాకుండా ఫారిన్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని కథా వస్తువుగా ఎంచుకున్నారట . అమెరికా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మితం కానున్నట్లు తెలుస్తోంది . ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ …… అవసరాల శ్రీనివాస్నాగశౌర్య ల కాంబినేషన్ లో మరో సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది .