750 కోట్లతో సంచలనం సృష్టిస్తున్న ఎవెంజర్స్


భారతదేశంలో రేపు విడుదల అవుతుండగా ఆల్రెడీ చైనాలో విడుదలైన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సంచలనం సృష్టిస్తోంది . ఒక్క రోజులోనే 750 కోట్ల భారీ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను పిచ్చెక్కిస్తోంది . ఎవెంజర్స్ కోసం విదేశాలలోనే కాదు భారత్ లో కూడా టికెట్ల కోసం రోడ్ల మీద కిలో మీటర్ ల కొద్దీ క్యూ కడుతున్నారు . ఇక హైదరాబాద్ లో అయితే దీనిగురించి చెప్పాల్సిన అవసరమే లేకుండాపోయింది ఎక్కడ చూడు ఎవెంజర్స్ హడావుడే !

ఇప్పటికే పది లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోవడంతో ఎవెంజర్స్ ఇండియా బాక్సాఫీస్ ని కూడా కుమ్మేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఒక్క చైనాలో అది కూడా ఒక్క రోజులోనే 750 కోట్ల వసూళ్లు అంటే మాటలు కాదు దాంతో భారత్ లో కూడా పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు . భారత్ లో ఎవెంజర్స్ హడావుడి రేపు మొదలు కానుంది