అనసూయ కు ఎవెంజర్స్ నచ్చలేదట !


అనసూయ కు ఎవెంజర్స్ నచ్చలేదట !
అనసూయ
హాట్ భామ అనసూయ కు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ అంతగా నచ్చలేదట ! ఎవెంజర్స్ సిరీస్ లో వచ్చిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమా కోసం జనాలు ఎగబడి చూస్తున్నారు . మొదటి వారంలో అయితే ఈ సినిమాకున్న క్రేజ్ మాటల్లో చెప్పలేం ఎందుకంటే పెద్దలు , పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఎవెంజర్స్ కోసం ఎగబడ్డారు . అయితే ఇప్పుడు మాత్రం ఊపు తగ్గింది కొంతమందికి ఎవెంజర్స్ నచ్చలేదు అందులో అనసూయ కూడా ఒకరు .
బిజీ షెడ్యూల్ వల్ల అనసూయ కు ఎవెంజర్స్ సినిమా చూడటం కుదరలేదట ! మొత్తానికి వీలు చూసుకొని సినిమా చూసింది బాగానే ఉంది కానీ నేను ఆశించిన స్థాయిలో అయితే లేదు . ఎప్పుడెప్పుడు చూద్దామా ! అన్న అతృతతో వెళ్లిన నాకు ఆ ఎగ్జైట్ మెంట్ అయితే లభించలేదు అని తేల్చి పడేసింది అనసూయ . ఈ హాట్ భామ లాగా చెప్పిన వాళ్ళు చాలా మందే ఉన్నారు మరి .