రికార్డుల మోత మోగిస్తున్న ఎవెంజర్స్ ఎండ్ గేమ్


హాలీవుడ్ చిత్రం ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది . ఇండియాలో కేవలం అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలోనే పది లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఇక అమెరికాలో అయితే చెప్పతరమే కాదు ఎన్ని షోలు వేసినా …… ఎన్ని స్క్రీన్ లు బుక్ చేసినా హౌజ్ ఫుల్స్ తో అదరగొడుతోంది . అమెరికాలో ఎవెంజర్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎక్కువ స్క్రీన్ లు పెంచారు . అమెరికాలో ప్రతీ 15 నిమిషాలకు ఒక షో చొప్పున 72 గంటల పాటు నిర్విరామంగా షోలు ప్రదర్శించే ఏర్పాట్లు చేసారు నిర్వాహకులు .

ఎన్ని స్క్రీన్ లు పెంచినప్పటికీ అన్ని షోలకు పెద్ద ఎత్తున స్పందన వస్తూనే ఉంది . ఇక ఇండియాలో కూడా షోలు పడ్డాయి . అప్పుడే ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు ఎవెంజర్స్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . ఇక ఎవెంజర్స్ ప్రదర్శితమౌతున్న థియేటర్ లలో గోలలు ఈలలతో దద్దరిల్లి పోతున్నాయి . ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా స్పందన కూడా అద్భుతంగా ఉండటంతో వరల్డ్ వైడ్ గా రికార్డుల మోత మోగడం ఖాయమని నెంబర్ వన్ చిత్రంగా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ నిలవడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .